Spiritual: ‘అర్జునా- ఫాల్గుణా’ జపం వెనుక ఉన్న పురాణ కథ

Spiritual: వర్షాకాలం వచ్చిందంటే ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం సాధారణంగా కనిపిస్తుంది. అయితే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో ఉరుము వినిపించినప్పుడు చిన్నారుల నుంచి పెద్దల వరకు చాలామంది ఉలిక్కిపడటం సహజం. అలాంటి సందర్భాల్లో మన పెద్దలు తరచూ “అర్జునా... ఫాల్గుణా...” అంటూ పలకడం మనం చూస్తుంటాం. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా ఒక పురాణ నేపథ్యం కూడా ఉందని విశ్వసిస్తారు. అదే సమయంలో దీనికి సంబంధించిన కొన్ని మానసిక అంశాలను కూడా నిపుణులు ప్రస్తావిస్తుంటారు. పురాణాల ప్రకారం ఈ ఆచారానికి మూలం మహాభారతంలో కనిపిస్తుంది. పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న అనంతరం అర్జునుడు తన అసలు స్వరూపాన్ని వెల్లడించిన...