Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్
Telangana: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఉచిత జీవిత బీమా పథకాన్ని ఈ నెల 25వ తేదీన అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర రాజధానిలోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. “ఉద్యోగుల జీవిత బీమా పథకం” పేరుతో అమలు కానున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు భారీ స్థాయిలో ఆర్థిక రక్షణ లభించనుంది. ఈ పథకం కింద ఉద్యోగులు లేదా పెన్షనర్లు సహజ మరణం...