CNG Cars: టాప్ 3 బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ CNG కార్లు.. కిలోకు 27 కి.మీల మైలేజ్
CNG Cars: భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు సొంత కారు అనేది ఒక పెద్ద కల. ముఖ్యంగా ఇంట్లో 6 నుంచి 7 మంది సభ్యులు ఉన్నప్పుడు సాధారణ 5 సీట్ల కార్లు సరిపోవు. అయితే పెద్ద వాహనం కొనుగోలు చేయాలంటే అధిక ధరతో పాటు ఇంధన ఖర్చులు కూడా భారం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులందరూ సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు, అదే సమయంలో నెలవారీ ఖర్చులను తగ్గించేందుకు సిఎన్జీ వాహనాలు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉండటంతో పాటు మంచి మైలేజ్ అందించే 7 సీట్ల సిఎన్జీ కార్లకు ప్రస్తుతం మార్కెట్లో భారీ డిమాండ్ కనిపిస్తోంది. పెద్ద కుటుంబాలకు అందుబాటు ధరలో అత్యుత్తమ...