Rajasthan: జైష్ ఉచ్చులో మహిళ.. ఏటీఎస్ ఏంట్రీతో..!
Rajasthan: రాజస్థాన్‌లో ఉగ్రవాద అనుమానిత కార్యకలాపాలకు సంబంధించి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) చేపట్టిన ఆపరేషన్ సంచలనంగా మారింది. సవాయ్ మాధోపూర్ జిల్లాకు చెందిన బబిత ధాకడ్ అనే మహిళను ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగించిన అనుమానంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి అందిన కీలక సమాచారంతో ఈ చర్య చేపట్టినట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. అనంతరం ఆమెను జైపూర్‌కు తరలించి ప్రత్యేక బృందాలు విస్తృతంగా విచారిస్తున్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో కేంద్ర నిఘా సంస్థలు కూడా ఈ కేసుపై దృష్టి సారించాయి. దర్యాప్తులో భాగంగా బబిత ధాకడ్ సోషల్ మీడియా వేదికల ద్వారా పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద...