Viral News: వామ్మో ఇదేం కోరిక.. అత్త చనిపోవాలంటూ నోటుపై రాసి!

Viral News: అనంతపురం జిల్లాలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది. సాధారణంగా భక్తులు తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో శాంతి నెలకొనాలని, ఆరోగ్యం, ఉద్యోగం, విద్య, వివాహం వంటి అంశాల్లో ఆశీర్వాదాలు కోరుతూ దేవుడికి మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు తమ మనసులోని బాధలను కాగితాలపై రాసి హుండీలో వేస్తుంటారు. అయితే ఈసారి హుండీలో లభించిన ఓ రూ.20 నోటుపై రాసిన సందేశం ఆలయ సిబ్బందిని, భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. హుండీ లెక్కింపు సమయంలో ఒక రూ.20 నోటుపై “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు”...