Andhra Pradesh: మాటల్లో కాదు.. చేతల్లోనే.. సర్కార్ బడిలో కలెక్టర్ కుమారుడి చదువు

Andhra Pradesh: పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎ.ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆయన తన కుమారుడు ఎన్.క్రిష్ ధరన్ రెడ్డిని పార్వతీపురంలోని డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో చేర్పించారు. సాధారణంగా ఉన్నతాధికారులు తమ పిల్లలను ప్రైవేట్ లేదా కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివించేందుకు మొగ్గు చూపే పరిస్థితుల్లో, ఒక జిల్లా కలెక్టర్ తన కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ఆయనకు ఉన్న నమ్మకం స్పష్టంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్.క్రిష్ ధరన్ రెడ్డి గతంలో విజయవాడలోని...