Hyderabad: ఫాస్ట్ ఫుడ్ గోదాములో భయంకర దృశ్యాలు!
Hyderabad: హైదరాబాద్లో కల్తీ ఆహారం, నాణ్యతలేని ఆహార పదార్థాల తయారీపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత 2 రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీలు ఆహార వ్యాపారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారుతున్న అపరిశుభ్ర ఆహార తయారీ కేంద్రాలు, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న గోదాములపై వరుసగా దాడులు నిర్వహిస్తూ కఠిన చర్యలు చేపడుతున్నారు. ఆహార భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తాజాగా చార్మినార్ పరిధిలోని హుస్సేనీఆలం ప్రాంతంలో ఉన్న ‘అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్’ గోదాముపై హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది....