Indian Railways: తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే జర్నీ
Indian Railways: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించేలా వందే భారత్ స్లీపర్ రైళ్ల విస్తరణకు కేంద్ర రైల్వే శాఖ చర్యలు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తుండగా, ఇప్పుడు రాత్రిపూట సుదూర ప్రయాణాలకు అనుకూలంగా స్లీపర్ సౌకర్యంతో కూడిన ప్రత్యేక వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ రైళ్లలో కేవలం కూర్చునే సీట్లే ఉండటంతో ఎక్కువ దూరం ప్రయాణించే ప్రయాణికులు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ కోచ్‌లతో కూడిన కొత్త రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది....