Weather Report: వచ్చే 3 రోజులు వర్షాలు కురుస్తాయా..?

Weather Report: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు మిశ్రమంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మండే ఎండలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు అమరావతి వాతావరణ కేంద్రం తాజా వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం జూన్ 15, 2026 నాటికి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి 18° ఉత్తర అక్షాంశం, 60° తూర్పు రేఖాంశం నుంచి 18° ఉత్తర అక్షాంశం, 65° తూర్పు...