Education: విద్యార్థులకు కీలక అప్‌డేట్.. సీబీఎస్ఈ 10వ తరగతి సెకండ్‌ బోర్డు ఫలితాలు వచ్చేస్తున్నాయ్..

Education: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10వ తరగతి సెకండ్ బోర్డు పరీక్షల ఫలితాలను త్వరలో విడుదల చేయనుంది. విద్యార్థులకు తమ మార్కులను మెరుగుపరుచుకునే అవకాశంగా నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. మే 15 నుంచి మే 21 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్ఈ ప్రకటించిన సమాచారం ప్రకారం.. రెండో బోర్డు పరీక్షల ఫలితాలు జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఫలితాల విడుదల తేదీ, సమయంపై బోర్డు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా తమ...