Redmi Turbo 5: రెడ్‌మీ నుంచి అదిరిపోయే లుక్‌తో కాంప్యాక్ట్ ఫోన్
Redmi Turbo 5: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రెడ్‌మీ భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. చైనా మార్కెట్లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన రెడ్‌మీ టర్బో 5 ఇప్పుడు భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన కెమెరా ఫీచర్లతో ఈ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.59 అంగుళాల ఫ్లాట్ అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. 1.5K రిజల్యూషన్‌తో సినిమాలు, వీడియోలు, గేమింగ్ అనుభవం మరింత మెరుగ్గా ఉండేలా...