Employee Benefits: పీఎఫ్ వడ్డీ అకౌంట్లోకి ఎప్పుడంటే?.. కేంద్రం క్లారిటీ

Employee Benefits: ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాదారులకు ఊరటనిచ్చే సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పీఎఫ్ వడ్డీ జమ కోసం కోట్లాది మంది ఉద్యోగులు ఎదురుచూస్తుండగా, వడ్డీ మొత్తాలు ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయనే అంశంపై స్పష్టత లభిస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ వడ్డీ రేటును ఖరారు చేసినప్పటికీ, ఇప్పటి వరకు ఖాతాల్లో వడ్డీ జమ కాకపోవడంతో పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పీఎఫ్ ఖాతాల బ్యాలెన్స్‌ను తరచూ పరిశీలిస్తూ వడ్డీ క్రెడిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ చివరి వారం నుంచి జులై మొదటి వారంలోపు...