Lord Jagannath Story: జగన్నాథుడి విగ్రహాలు ఎందుకు అసంపూర్ణంగా కనిపిస్తాయి..?
Lord Jagannath Story: భారతదేశంలోని అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రాల్లో ఒకటైన ఒడిశా రాష్ట్రంలోని పూరీ జగన్నాథ ఆలయం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా నిలిచింది. చార్ ధామ్ యాత్రలో భాగమైన ఈ ప్రసిద్ధ ఆలయంలో శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా, ఆయన అన్న బలభద్రుడు మరియు సోదరి సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. అయితే ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచే అంశం దేవతల విగ్రహాల ప్రత్యేక రూపమే. సాధారణంగా దేవాలయాల్లో కనిపించే సంపూర్ణ విగ్రహాలకు భిన్నంగా, ఇక్కడి మూర్తులు చేతులు, కాళ్లు పూర్తిగా లేకుండా అసంపూర్ణ ఆకృతిలో ఉండటం వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి సంవత్సరం ఆషాఢ...