CM Revanth Reddy: ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రాష్ట్రానికే ఆదర్శం
CM Revanth Reddy: రంగారెడ్డి జిల్లా ఆరుట్ల గ్రామం తెలంగాణ విద్యా రంగ చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించి రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆరుట్లలో ప్రారంభమైన విద్యా సంస్కరణల ప్రయాణం ఒక గ్రామానికే పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ విద్యా వ్యవస్థకు కొత్త దిశను చూపించబోతుందని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు కేవలం ఆధునిక భవనాల్లో, ఆకర్షణీయమైన నిర్మాణాల్లో లేదని, విద్యార్థులు చదువుకునే తరగతి గదుల్లోనే రాష్ట్ర భవిష్యత్తు...