Traffic Rules: బైక్‌పై ఇవి పెట్టుకుంటే భారీగా జరిమానా

Traffic Rules: రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారుల భద్రతను పెంపొందించడం లక్ష్యంగా దేశవ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేయడం, వాహనాలను సీజ్ చేయడం వంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ముఖ్యంగా బైక్‌లలో అనధికార మార్పులు చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారులు నిబంధనలను పట్టించుకోకుండా ప్రమాదకర మార్పులతో రోడ్లపై సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో కొంతమంది యువకులు తమ ద్విచక్ర వాహనాలకు కంపెనీ అందించే సైలెన్సర్లను తొలగించి, భారీ...