Women Empowerment: భారతీయ మహిళల జీవితాల్లో పెను మార్పులు..?
Women Empowerment: భారత్లో మహిళల జీవనశైలిలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. విద్య, ఉపాధి, ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు సంప్రదాయ వైవాహిక జీవితానికి భిన్నంగా స్వతంత్ర జీవన విధానాన్ని ఎంచుకుంటున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తోంది. పెళ్లి చేసుకోకుండా ఉండటం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం లేదా వ్యక్తిగత కారణాలతో ఒంటరిగా జీవించడం వంటి పరిస్థితులు గతంతో పోలిస్తే గణనీయంగా పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒంటరిగా జీవిస్తున్న మహిళల శాతంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. అక్కడ 11.6 శాతం మంది మహిళలు ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అనంతరం కేరళ 10.4 శాతంతో...