Telangana: మహిళా లెక్చరర్‌కు అసభ్యకర మెసేజ్‌లు.. సీన్ కట్ చేస్తే..

Telangana: మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండల కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల మహిళా కళాశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే మహిళా లెక్చరర్‌పై వేధింపులు, అనంతరం భౌతిక దాడి జరగడం ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని నెలలుగా ఓ యువకుడు ఆమెను మానసికంగా వేధిస్తుండగా, చివరకు కళాశాల ప్రాంగణంలోనే దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో ఉపాధ్యాయ వర్గాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమాచారం ప్రకారం, కళాశాలలో క్యాటరింగ్ కాంట్రాక్ట్ నిర్వహిస్తున్న వ్యక్తి కుమారుడు రమేష్ అనే యువకుడు అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా లెక్చరర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఫోన్ నంబర్...