Viral News: ఒక్క వెన్న ప్యాకెట్.. నకిలీ ఐపీఎస్ బండారం బయటపెట్టింది!
Viral News: కేవలం రూ.40 కోసం చేసిన ఓ చిన్న మోసం చివరికి పోలీస్ కేసుగా మారిన ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో వెలుగులోకి వచ్చింది. వెన్న ప్యాకెట్ కొనుగోలు చేసిన తర్వాత డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ వ్యక్తి తాను ఐపీఎస్ అధికారినని చెప్పుకుంటూ దుకాణదారుడిని బెదిరించడం స్థానికంగా సంచలనంగా మారింది. అయితే అతడి నాటకం ఎక్కువసేపు సాగకపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి అసలు నిజాన్ని బయటపెట్టారు. లక్నోలోని మహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గోల్ మార్కెట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మిథిలేష్ శుక్లా అనే వ్యక్తి అక్కడ ఉన్న ఓ టీ స్టాల్ వద్దకు వెళ్లి రూ.40 విలువైన సీల్...