Viral News: కరెంట్ బిల్లు చూసి.. ఆత్మహత్య చేసుకున్నాడు!

Viral News: ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో చోటుచేసుకున్న విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అధిక విద్యుత్ బిల్లులు, భారీ జరిమానాలు, బకాయిల వసూళ్ల పేరుతో వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఓ చిన్న వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలచివేసింది. సైద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మురాద్‌చక్ గ్రామానికి చెందిన పాన్ షాప్ యజమాని సురేంద్ర కశ్యప్ విషం సేవించి ప్రాణాలు తీసుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటన స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ప్రస్తుతం అధికారుల వ్యవహార శైలిపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. సుమారు ఏడాది క్రితం విద్యుత్ శాఖ విజిలెన్స్ బృందం సురేంద్ర నిర్వహిస్తున్న చిన్న దుకాణంపై...