Kerala Schools: పిల్లల ఫ్యూచర్ కోసం లిప్ స్టిక్ నిషేధం
Kerala Schools: విద్యార్థుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం ఇస్తూ కేరళలోని పలు ప్రభుత్వ పాఠశాలలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. చిన్న వయసులోనే సౌందర్య సాధనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పాఠశాలలకు వచ్చే విద్యార్థులు పెన్నులు, పుస్తకాలతో పాటు లిప్‌స్టిక్‌లు, ఇతర అలంకరణ వస్తువులను తీసుకువస్తూ విరామ సమయంలో ఉపయోగిస్తున్నట్లు గుర్తించడంతో పలు పాఠశాలలు “నో మేకప్ పాలసీ” అమలు దిశగా అడుగులు వేస్తున్నాయి. పిల్లలు చిన్న వయసులోనే సౌందర్య సాధనాలను ఎక్కువగా ఉపయోగించడం ఆరోగ్యపరంగా మంచిది కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మానికి నేరుగా తగిలే ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు...