Interesting Facts: 1000కి ‘T’ కాకుండా ‘K’ని ఎందుకు వాడుతారు..?

Interesting Facts: సోషల్ మీడియాలో 10K, 50K, 100K వంటి సంఖ్యలను మనం ప్రతిరోజూ చూస్తూనే ఉంటాం. యూట్యూబ్ చందాదారులు, ఇన్‌స్టాగ్రామ్ అనుచరులు, వీడియో వీక్షణలు, జీతాలు, వ్యాపార గణాంకాలు ఇలా అనేక సందర్భాల్లో ‘K’ అనే అక్షరం వెయ్యి సంఖ్యకు ప్రతీకగా కనిపిస్తుంది. అయితే చాలామంది మనసులో ఒక సందేహం మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఇంగ్లీష్‌లో వెయ్యిని ‘థౌజండ్’ అని పిలుస్తారు కదా, మరి ‘T’ అక్షరాన్ని కాకుండా ‘K’ అక్షరాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు? దీని వెనుక దాగి ఉన్న చరిత్ర తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కథ ఆధునిక సోషల్ మీడియాతో మొదలైనది కాదు. దీని మూలాలు వేల ఏళ్ల చరిత్రలో...