Telangana: సన్న వడ్లు, ఎరువులపై సర్కార్ కీలక ఆదేశాలు..!

Telangana: తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికీకరించి రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వ్యవసాయ శాఖ పనితీరుపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో రైతులకు అవసరమైన సేవలను మరింత సమర్థవంతంగా అందించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పంటల ఉత్పాదకతను మెరుగుపరచడం, వ్యవసాయ రంగంలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో బోనస్‌కు అర్హత కలిగిన 7 రకాల సన్న వడ్ల విత్తనాలను రైతులకు సులభంగా అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ విత్తనాలను సబ్సిడీపై...