Crime: హనీట్రాప్ కేసులో షాకింగ్ ట్విస్ట్..!
Crime: చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత కలిగిన వారిపైనే నేర ఆరోపణలు రావడం సమాజంలో తీవ్ర ఆందోళనకు దారితీస్తుంది. తాజాగా బీహార్ రాష్ట్రంలోని భాగల్పూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన పోలీసు వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ట్రక్ డ్రైవర్ను హనీట్రాప్ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఓ ట్రైనీ సబ్ఇన్స్పెక్టర్తో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జూన్ 14 రాత్రి ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ ప్రాంతానికి చెందిన ట్రక్ డ్రైవర్ సురేంద్ర యాదవ్ కతిహార్ నుంచి తన వాహనంలో తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. ఈ సమయంలో జాతీయ రహదారి-31పై రంగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బృందం...