Andhra Pradesh: అంతుచిక్కని మిస్టరీ.. నంది నోటి నుంచి నిరంతరం ఆగని నీళ్లు

Andhra Pradesh: చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని రామగిరి గ్రామంలో ఉన్న ప్రాచీన శివాలయం భక్తులను మాత్రమే కాకుండా పరిశోధకులను సైతం ఆకర్షిస్తున్న అరుదైన క్షేత్రంగా గుర్తింపు పొందింది. దాదాపు 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం పల్లవుల కాలం నాటి నిర్మాణ వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. అయితే ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది ఇక్కడి నంది విగ్రహం. సాధారణంగా ఆలయాల్లో నంది విగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ రామగిరిలోని నంది విగ్రహం నోటి నుంచి సంవత్సరం పొడవునా నిరంతరం జలధార ప్రవహించడం విశేషం. వర్షాకాలం అయినా, ఎండాకాలం అయినా ఈ జల ప్రవాహం ఆగకుండా కొనసాగుతుండటం భక్తుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నంది నోటి...