Viral Video: జూమ్ మీటింగ్‌లో ఉద్యోగి మాస్టర్ ప్లాన్‌కు జనం ఫిదా!

Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తే, మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది. ఇంటి నుంచే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం, ఆన్‌లైన్ సమావేశాల్లో పాల్గొనడం ఇప్పుడు సాధారణ విషయంగా మారిపోయింది. అయితే ఒక ఉద్యోగి చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా నవ్వుల్లో ముంచెత్తింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో దక్షిణ కొరియాకు చెందిన ఓ ఉద్యోగి తన ఆఫీస్ ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నాడు. అతని సహోద్యోగులు, ఉన్నతాధికారులు అందరూ తమ తమ ఇళ్ల నుంచి సమావేశంలో చేరారు. కానీ...