Andhra Pradesh: సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో సీఎం చంద్రబాబు కీలక భేటీ
Andhra Pradesh :సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దేశ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక రంగం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, విద్యా పరిశోధనలు, గ్రీన్ ఎనర్జీ వంటి అనేక రంగాల్లో సహకారం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌ను అత్యాధునిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా వివరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక రంగాల్లో సింగపూర్ సహకారం కోరారు. ముఖ్యంగా...