FBI Ghost Town: నకిలీ పట్టణంతో హ్యాకర్లకు చెక్
FBI Ghost Town: ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. అత్యాధునిక సైబర్ దాడులను గుర్తించడం, వాటికి తక్షణ ప్రతిస్పందన ఇవ్వడం, దర్యాప్తు అధికారులకు వాస్తవ పరిస్థితులపై శిక్షణ అందించడం లక్ష్యంగా అమెరికాలో పూర్తిస్థాయి నకిలీ పట్టణాన్ని ఏర్పాటు చేసింది. అలబామా రాష్ట్రంలోని హంట్స్విల్లే నగరంలో నిర్మించిన ఈ ప్రత్యేక కేంద్రానికి ‘కైనెటిక్ సైబర్ రేంజ్’ అనే పేరు పెట్టారు. సుమారు 22 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు సాధారణ అమెరికన్ పట్టణాన్ని తలపించేలా రూపొందించబడింది. ఇందులో నివాస గృహాలు, హోటల్, పెట్రోల్...