Organic Farming: బీరకాయలు ఎక్కువగా కాయాలంటే..

Organic Farming: ఇంటి మిద్దె తోటలో బీరకాయలను సాగు చేయాలనుకునే వారికి సరైన మట్టి మిశ్రమం, ఎరువుల నిర్వహణ, నీటి పారుదల ఎంతో కీలకం. సరైన పద్ధతులు పాటిస్తే బీరకాయ మొక్కలు వేగంగా పెరిగి సమృద్ధిగా కాయలను అందిస్తాయి. ముఖ్యంగా సేంద్రియ పద్ధతులను అనుసరించడం ద్వారా ఆరోగ్యకరమైన పంటను పొందడమే కాకుండా దిగుబడిని కూడా పెంచుకోవచ్చు. బీరకాయ మొక్కల పెరుగుదలకు పోషకాలు సమృద్ధిగా ఉండే మట్టి అవసరం. ఇందుకోసం ఎర్రమట్టి, వర్మీకంపోస్ట్ లేదా బాగా కుళ్లిన పశువుల ఎరువు, కోకోపీట్‌ను సమాన పరిమాణంలో కలిపి కంటైనర్‌లలో నింపాలి. ఈ మిశ్రమం మట్టిలో తేమను సమతుల్యంగా ఉంచడమే కాకుండా మొక్కలకు అవసరమైన పోషకాలను నిరంతరం అందిస్తుంది. దీంతో...