Child Safety: సోషల్ మీడియాపై బ్యాన్..?
Child Safety: ఆన్లైన్ ప్రపంచంలో చిన్నారుల భద్రతను మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. 16 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వినియోగంపై కఠిన ఆంక్షలు విధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే టిక్‌టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, స్నాప్‌చాట్, రెడ్డిట్, థ్రెడ్స్, యూట్యూబ్, ట్విచ్, కిక్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికలను 16 ఏళ్లలోపు పిల్లలు ఉపయోగించకుండా పరిమితులు అమలు చేసే అవకాశం ఉంది. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఈ అంశంపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశమున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ప్రతిపాదిత నిబంధనల...