Iran US Deal: యుద్దానికి బ్రేక్.. అమెరికా- ఇరాన్ ఒప్పందంపై మోదీ స్పందన!

Iran US Deal: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతించారు. పశ్చిమ ఆసియాలో నెలల తరబడి కొనసాగిన ఉద్రిక్తతలకు ఈ ఒప్పందం ముగింపు పలకడంతో పాటు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి కొత్త మార్గం సుగమం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యం, నౌకాయాన రంగం, ఇంధన సరఫరా వ్యవస్థలకు కూడా ఈ పరిణామం ఊరటనిస్తుందని పేర్కొన్నారు. సోమవారం (జూన్ 15) సోషల్ మీడియా వేదికలో స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో నెలకొన్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపాయని...