Kamru Nag Temple: సరస్సులో కోట్ల నిధి దాగి ఉందా..?

Kamru Nag Temple: భారతదేశంలోని అనేక దేవాలయాలు తమ ప్రత్యేక చరిత్ర, ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రకృతి అందాలతో భక్తులను ఆకర్షిస్తుంటాయి. అలాంటి అరుదైన పుణ్యక్షేత్రాల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని కమ్రూ నాగ్ ఆలయం ఒకటి. హిమాలయ పర్వతాల మధ్య అద్భుతమైన ప్రకృతి సోయగాల నడుమ వెలసిన ఈ దేవాలయం స్థానిక ప్రజల విశ్వాసాలకు కేంద్రబిందువుగా నిలిచింది. ముఖ్యంగా ఈ ఆలయాన్ని “వర్షాల దేవుడి ఆలయం”గా భావిస్తారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కమ్రూ నాగ్ స్వామిని ప్రార్థిస్తే వర్షాలు కురుస్తాయని స్థానికులు తరతరాలుగా విశ్వసిస్తూ వస్తున్నారు. అందుకే ఈ క్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు ప్రజల జీవన విధానంతో కూడా విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో...