Snake's tongue: వార్నీ దీని వెనుక ఇంక కథ ఉందా..?
Snake's tongue: మన చుట్టూ కనిపించే జీవుల్లో పాములు అత్యంత ఆసక్తికరమైన జీవులుగా గుర్తింపు పొందాయి. పాములను చూసిన వెంటనే చాలా మంది భయంతో దూరంగా వెళ్లిపోతారు. వాటి విషపూరిత కాటు కారణంగా ప్రమాదకర జీవులుగా భావిస్తారు. అయితే వాస్తవానికి చాలా పాములు మనుషులపై ఉద్దేశపూర్వకంగా దాడి చేయవు. తమకు ప్రమాదం ఏర్పడిందని భావించినప్పుడు లేదా ఆత్మరక్షణ కోసం మాత్రమే అవి స్పందిస్తాయి. మిగతా సమయాల్లో తమ దారిన తాము వెళ్లిపోతుంటాయి. అయితే పాములను జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. అవి తరచూ తమ నాలుకను బయటకు తీసి మళ్లీ లోపలికి తీసుకుంటూ ఉంటాయి. చాలామంది దీనిని కోపం లేదా దాడి చేయడానికి...