Wildlife Facts: ఎవరి బలం వారికి ప్రత్యేకం.. మరి గెలుపు ఎవరి వశం..?

Wildlife Facts: అడవిలో జీవించే ప్రతి జంతువుకు ప్రకృతి ఒక ప్రత్యేకమైన సామర్థ్యాన్ని ప్రసాదించింది. కొన్ని జంతువులు తమ వేగంతో శత్రువులను మట్టికరిపిస్తే, మరికొన్ని తెలివితేటలతో ప్రమాదాల నుంచి బయటపడతాయి. ఇంకొన్ని అసాధారణ రక్షణ వ్యవస్థలతో తమ ప్రాణాలను కాపాడుకుంటాయి. అలాంటి జంతువుల్లో ముళ్ల పంది ఒకటి. మరోవైపు వేగం, చురుకుదనం, వేట నైపుణ్యంతో అడవిలో అగ్రశ్రేణి వేటగాడిగా గుర్తింపు పొందిన జంతువు చిరుతపులి. ఈ రెండు జంతువులు ఒకదానికొకటి ఎదురైతే ఏం జరుగుతుందనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. చిరుతపులి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన భూ జంతువులలో ఒకటిగా గుర్తింపు పొందింది. గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగల సామర్థ్యం దీనికి ఉంది....