Andhra Pradesh: అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. కట్ చేస్తే

Andhra Pradesh: చిత్తూరు జిల్లాలో ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు చివరకు ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన మరింత సంచలనంగా మారింది. మృతుడి కుటుంబ సభ్యులు ఇది సాధారణ ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం పిలిపించి దాడి చేసి హత్య చేశారని ఆరోపిస్తుండగా, మరోవైపు ప్రమాదవశాత్తు మిద్దెపై నుంచి పడిపోవడంతో గాయాలయ్యాయని మరో వాదన వినిపిస్తోంది. దీంతో ఈ ఘటన ప్రస్తుతం మిస్టరీగా మారి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మృతుడు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్‌గా గుర్తించారు. కుటుంబ సభ్యులు...