El Nino Effect: టెన్షన్లో అధికారులు
El Nino Effect: తెలంగాణలో నైరుతి రుతుపవనాల సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం ఆందోళనకు దారి తీస్తోంది. దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, అధికార పార్టీ నాయకుల్లో ఆందోళన పెరుగుతోంది. వర్షాలపై ఆధారపడి ఉండే వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుండటంతో వర్షాభావ పరిస్థితులు కొనసాగితే రైతులతో పాటు పలు వర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులపై ఆధారపడి జీవనం సాగించే కూలీలు, వ్యవసాయ యంత్రాల యజమానులు, ట్రాక్టర్ నిర్వాహకులు, విత్తనాలు,...