Viral Video: ఆమె ధైర్యానికి సెల్యూట్ కొడుతున్న నెటిజన్లు!

Viral Video: పాము కనిపించిందంటే చాలామంది భయంతో అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ముఖ్యంగా భారీ పరిమాణంలో ఉన్న పాము ఎదురైతే పరిస్థితి మరింత భయానకంగా మారుతుంది. అయితే ఓ మహిళ చూపించిన అసాధారణ ధైర్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రమాదకరంగా కనిపించిన ఓ భారీ పామును ఆమె ఎంతో ప్రశాంతంగా, నైపుణ్యంతో రక్షించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆమె చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఓ నివాస ప్రాంతంలో అకస్మాత్తుగా పొడవాటి పాము కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాము పరిమాణం...