Andhra Pradesh: 529 ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఉద్యోగం పొందే ఛాన్స్

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ అవకాశాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో జూన్ 30, 2026 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం...