Andhra Pradesh: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రాసినవారికి బిగ్ అప్డేట్.. ఫలితాల తేదీ
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం దగ్గరపడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలితాల కోసం ఆతృతగా ఎదురుచూస్తుండగా, వారి నిరీక్షణకు త్వరలోనే ముగింపు పలకనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారంలోనే ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 15 నుంచి జూన్ 18 మధ్యలో ఎప్పుడైనా ఫలితాలను ప్రకటించే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ ఏడాది నిర్వహించిన ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే...