Weather Science: వర్షం పడే ముందు ఉరుములు ఎందుకు వస్తాయో తెలుసా?
Weather Science: వర్షాకాలం ప్రారంభమైతే ఆకాశం నల్లటి మేఘాలతో కమ్ముకోవడం, ఆ తర్వాత మెరుపులు మెరవడం, ఉరుములు వినిపించడం సహజం. చాలా మంది వర్షం కురిసే ముందు వినిపించే ఈ భారీ శబ్దాల గురించి ఆసక్తిగా ఆలోచిస్తుంటారు. అసలు ఉరుములు ఎందుకు వస్తాయి? మెరుపులు, ఉరుముల మధ్య సంబంధం ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాశంలో కనిపించే మేఘాలు నీటి బిందువులు, మంచు స్ఫటికాలతో ఏర్పడతాయి. గాలుల ప్రభావంతో ఈ మేఘాలు ఒకదానికొకటి ఢీకొనడం, రాపిడి చెందడం వల్ల వాటిలో విద్యుత్ ఛార్జీలు ఏర్పడతాయి. సాధారణంగా మేఘాల పైభాగంలో ధనాత్మక ఛార్జీలు, దిగువ భాగంలో రుణాత్మక ఛార్జీలు పేరుకుపోతాయి. ఈ ఛార్జీల మధ్య వ్యత్యాసం...