Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు మీకు వస్తాయా?.. లేదా?.. ఇలా తెలుసుకోండి

Thalliki Vandanam: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక అండగా నిలుస్తోంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది. ఈ మొత్తంలో రూ.13,000ను విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేయగా, మిగిలిన రూ.2,000ను సంబంధిత పాఠశాల అభివృద్ధి కోసం స్కూల్ ఖాతాలో జమ చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌లో అర్హత ఎలా తెలుసుకోవాలి? ప్రభుత్వం లబ్ధిదారుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్...