Child Murder: రెండో పెళ్లి కోసం కన్న కొడుకునే..

Child Murder: తమిళనాడులోని సేలం జిల్లాలో మానవత్వాన్ని కలచివేసే విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రెండో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో తన 18 నెలల కుమారుడికి విషమిచ్చి హత్య చేసిన ఆరోపణలపై 23 ఏళ్ల మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్తూరు సమీపంలోని వరగూర్ గ్రామానికి చెందిన లలితకు తిరుమలై వాసుదేవన్‌తో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబ విభేదాల కారణంగా కొంతకాలంగా ఇద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. వారి పెద్ద కుమారుడు తండ్రి వద్ద ఉండగా, 18 నెలల చిన్న కుమారుడు తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ తరుణంలో...