Spirituality: మంత్ర పఠనంలో ఉండకూడని దోషాలు..
Spirituality: భక్తి మార్గంలో మంత్ర జపం, స్తోత్ర పారాయణం, నామస్మరణకు ప్రత్యేక స్థానం ఉంది. భగవంతుని స్మరించడం ద్వారా మనసుకు ప్రశాంతతతో పాటు పుణ్యఫలాలు కూడా లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే మంత్రాలు లేదా శ్లోకాలు చదివే సమయంలో అక్షర దోషాలు జరిగితే వాటి ప్రభావం ఎలా ఉంటుందనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ అంశంపై బ్రహ్మర్షి కాకునూరి సూర్యనారాయణ మూర్తి విశదీకరణ ఇచ్చారు. ఆయన వివరాల ప్రకారం.. జపం అనేది పాపాలను నశింపజేసే పవిత్ర సాధనంగా పరిగణించబడుతుంది. భక్తి, శ్రద్ధలతో దైవ నామాన్ని స్మరించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధ్యమవుతుందని చెప్పారు. అయితే మంత్రాలు, శ్లోకాలు పఠించే సమయంలో సరైన ఉచ్చారణ ఎంతో...