Kerala: మిథున మాస పూజలకు శబరిమల ఆలయం సిద్ధం.. నేటి నుంచే ప్రత్యేక పూజలు
Kerala: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో మిథున మాస పూజల సందర్భంగా ఆలయ తలుపులు జూన్ 14 నుంచి భక్తుల దర్శనార్థం తిరిగి తెరుచుకోనున్నాయి. నెలవారీ ప్రత్యేక పూజల నిర్వహణ కోసం దేవస్థానం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు ఇది శుభవార్తగా మారింది. సంప్రదాయబద్ధమైన ఆచారాలతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభం కానుండగా, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. దేవాలయ సంప్రదాయాల ప్రకారం తంత్రి కందరారు మహేష్ మోహనారు సమక్షంలో జూన్ 14 సాయంత్రం 5 గంటలకు మేళ్శాంతి ఈ.డి.ప్రసాద్ గర్భగుడి తలుపులు తెరవనున్నారు. అనంతరం దీపారాధన నిర్వహించి మిథున మాస...