Singapore: పెట్టుబడుల లక్ష్యంతో సీఎం చంద్రబాబు రెండు రోజుల విదేశీ పర్యటన
Singapore: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల కీలక సింగపూర్ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులకు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని పెంపొందించడం, సాంకేతిక మరియు పారిశ్రామిక రంగాల్లో సహకార అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా ఈ పర్యటన చేపడుతున్నారు. జూన్ 14న ఉదయం 11.35 గంటలకు బెంగళూరు నుంచి సింగపూర్‌కు బయల్దేరనున్న ముఖ్యమంత్రి, అక్కడ పలు ఉన్నతస్థాయి సమావేశాలు, వ్యాపార చర్చలు మరియు అంతర్జాతీయ వేదికల కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం జూన్ 15న ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో ముఖ్యమంత్రి తొలి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ రంగాలకు చెందిన...