Telangana: భారీ వర్షాలు.. హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్
Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. వర్షాల ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ ప్రకటించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ వర్ష ప్రభావిత ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని...