Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కీలక లేఖ
Kishan Reddy: సింగరేణి సంస్థలో చోటుచేసుకుంటున్నట్లు ప్రచారంలో ఉన్న అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాసి, సుమారు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందనే వార్తలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఈ ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసి, ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఆధారంగా నిలుస్తున్న సింగరేణి సంస్థ ప్రస్తుతం అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోందని కిషన్ రెడ్డి తన లేఖలో...