Telangana: సెలవులు రద్దు.. అధికారులు ఫీల్డ్‌లోనే ఉండాలి

Telangana: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ అధికారులను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అప్రమత్తం చేశారు. వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పైస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరూ పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని శని, ఆదివారాలు అనే తేడా లేకుండా అధికారులు అందరూ ఫీల్డ్‌లోనే అందుబాటులో ఉండాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితులు మినహా ఎవరూ విధులకు దూరంగా ఉండరాదని, ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా వర్షాలు, వరదల ప్రభావానికి...