Actress Mouni Roy: నేను గే కాదు..
Actress Mouni Roy: సినీ పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. ఇటీవల కాలంలో పలువురు ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను అభిమానులతో పంచుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి మౌని రాయ్ తన వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. అయితే విడాకుల ప్రకటన తర్వాత తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తాజాగా ఆమె స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. టెలివిజన్ రంగంలో స్టార్ నటిగా గుర్తింపు పొందిన మౌని రాయ్, అనంతరం సినిమాల్లోకి అడుగుపెట్టి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహ...