Sachkhand Express: దేశంలో ఉచితంగా 3 పూటల భోజనం అందించే ఏకైక రైలు ఇదే..

Sachkhand Express: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రతిరోజూ వేలాది రైళ్లు దేశంలోని వివిధ ప్రాంతాలను కలుపుతూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. సాధారణంగా రైళ్లలో ప్రయాణించే వారికి ఆహార సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటికి ప్రయాణికులు నిర్ణీత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అయితే దేశంలో ఒక ప్రత్యేక రైలు మాత్రం ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందిస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. దీర్ఘదూర ప్రయాణాలకు రైలును ఎంచుకునే వారికి ఈ విషయం ఆసక్తిని కలిగిస్తోంది. భారతీయ రైల్వే నిర్వహించే అనేక రైళ్లలో ఆహారం కొనుగోలు చేయాల్సి ఉండగా, సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే వారికి ఉచిత భోజనం అందుబాటులో...