Ujjain Temple: ఈ గుడిలో పూలు కాదు.. కోరికలు తీరాలంటే గడియారం ఇవ్వాలట.. ఎక్కడుందీ ఆలయం?

Ujjain Temple: భారతదేశంలో ఎన్నో విశిష్టతలు కలిగిన దేవాలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక ఆచారం, విశ్వాసం, సంప్రదాయం ఉంటుంది. సాధారణంగా దేవాలయాలకు వెళ్లే భక్తులు కొబ్బరికాయలు, పూలు, పండ్లు లేదా తమ ఇష్టదైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక ఆలయంలో మాత్రం ఈ సంప్రదాయాలకు భిన్నంగా గోడ గడియారాలను సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ విశేష ఆచారం కారణంగా ఆ ఆలయం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని సమీప ప్రాంతంలో ఉన్న ఘడి బాబా దేవాలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది. ఉజ్జయిని నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో భైరవ...